|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 03:36 PM
సుప్రీంకోర్టులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై విచారణ. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించి.. డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్. దీనిపై విచారణ జరిపి డీజీపీ శివధర్ రెడ్డి ఎంపిక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు