|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 11:05 AM
మహిళా న్యాయవాది హత్య కేసులో బయటపడ్డ కీలక అంశాలు. భూ వివాదంలో స్వప్న గొంతు కోసి హత్య పారిపోయిన సొంత అన్న . రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉండే గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం ఉండగా.. కొడుకు, పెద్ద కూతురుకి వివాహం జరిగింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న చిన్న కూతురు స్వప్న(34)కు ఇంకా వివాహం కాలేదు. శాంతయ్య మృతి అనంతరం అతని పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని భార్య వెంకటమ్మ పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, అందులో 6 ఎకరాలు తన కొడుకు రాజు పేరిట చేసి 4 ఎకరాలు తన పేరు మీద ఉంచుకున్న వెంకటమ్మ. సంవత్సరం క్రితం స్వప్నకు తెలియకుండా తన తల్లి పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తన అన్న రాజు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 ఎకరాల భూమిని తిరిగి తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన స్వప్న. ఈ క్రమంలో తల్లితో పొలం వద్ద సర్వే చేయిస్తుండగా, కొందరు వ్యక్తులతో పొలం వద్దకు వచ్చి స్వప్నపై కత్తితో దాడి చేసి, ఆమె గొంతు కోసి పారిపోయిన రాజు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే స్వప్న మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు . గత నెల తన స్కూటీకి ప్రమాదం జరగగా, స్వప్న కాలు విరిగింది. తన అన్నే తనపై దాడి చేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వప్న . భూ తగాదాల్లో స్వప్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, తనపై హత్యాయత్నం కేసు పెట్టిందని రాజు కొద్ది రోజులుగా తమతో చర్చించినట్లు తెలిపిన అతని స్నేహితులు. స్వప్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన తోటి న్యాయవాదులు