![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 08:13 PM
దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాపై మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘విజయ్ 69’, ‘దళపతి 69’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్, ప్రియమణి, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా తర్వాత అతడు పూర్తిస్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ అతడు పోటీ చేయనున్నాడు. ఈ జన నాయగన్ మూవీలో దళపతి విజయ్ తోపాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, మోనిషా బ్లెస్సీలాంటి వాళ్లు నటిస్తున్నారు.
Latest News