|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:22 PM
ప్రముఖ దర్శకుడు సుకుమార్ గద్దర్ ఫిల్మ్స్ అవార్డుల పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. "ప్రతిష్ఠాత్మకంగా భావించే గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో భాగంగా నాకు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా ఉంది. ఇంత గొప్ప అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక శిఖరంలాంటి వ్యక్తి బీఎన్ రెడ్డి గారి పేరు మీద నెలకొల్పిన అవార్డును అందుకోవడం మరింత గర్వకారణం. నా చిత్రాల్లో భాగస్వాములైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అలాగే నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని సుకుమార్ అన్నారు.
Latest News