by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:19 PM
జగిత్యాల మున్సిపల్ పరిధిలోని నూకపల్లి సరస్వతి గుట్టపై డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, డిఈ జలంధర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.