by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:18 PM
రామగుండము కార్పొరేషన్ 31వ డివిజన్ లో శనివారం కార్పోరేటర్ అడ్డాల స్వరూప-రామస్వామి ఆధ్వర్యంలో బస్తీ దవాఖాన వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ నర్మద మాట్లాడుతూ, వర్ష కాలంలో ఇంటి ఆవరణంలో కుండీల్లో, కూలర్లో, వండిన వంటల పైన ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్తపడాలి. దోమలతో డెంగ్యూ, జ్వరాలు వచ్చి అనేక వ్యాధులకు గురి కావలసి ఉంటుందన్నారు. అనంతరం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణి చేసారు.