by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:16 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట బావుసాయిపేట గ్రామంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా పంపిణీ చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నందు గౌడ్, దేవయ్య, శేఖర్, ప్రవీణ్ యాదవ్, దయాకర్, కరీం, దేవయ్య, సంజీవ్, పోశయ్య, శ్రీనివాసరావు, ముత్తయ్య, ఊశయ్య, రమేష్ ఉన్నారు.