by Suryaa Desk | Sat, Oct 05, 2024, 01:06 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గౌడ సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుత్బుల్లాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు కూన రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం కుత్బుల్లాపూర్ లో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణంతోపాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని కుత్బుల్లాపూర్ గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ గౌడ సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కూన శ్రీరాములు గౌడ్, మద్దెల జైరాజ్ గౌడ్, కూన సుధాకర్ గౌడ్, బస్పల్లి వ్యాస్ గౌడ్ , కూన శ్రవణ్ గౌడ్, నల్ల ప్రసాద్ గౌడ్, మద్దెల మధు గౌడ్, సంక్షేమ సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.