by Suryaa Desk | Thu, Nov 07, 2024, 02:16 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీ రామకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చంద్రయ్య లు మాట్లాడుతూ మల్టీ పర్పస్ విధానం రద్దు చెయ్యాలి. కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలి జి ఓ 51ని రద్దు చెయ్యాలి. అదేస్తనంలో60ని అమలు చెయ్యాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చెయ్యాలి.
యూనిఫామ్స్ సబ్బులు నూనెలు బుట్లు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి.ఇ స్ ఐ పీఫ్ అమలు చెయ్యాలి.8గంటల పనివిధానం అమలు చెయ్యాలి.ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్నా నుండి డిమాండ్ చేస్తున్నాము. ధర్నా అనంతరం డీపీవో కు అదనపు కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు కార్యకర్తలు వాటర్ మేన్స్, డ్రైవర్లు, కారోబర్స్, స్వీపర్స్ ఎలక్ట్రీషియన్ తదితరులు పాల్గొన్నారు.