by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:12 PM
క్రీడలతో విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి పెంపొందుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్- 17 బాల బాలికల ఖోఖో పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో మాధవి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, నాయకులు పాల్గొన్నారు.