by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:10 PM
TG: మంచిర్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్ అవడంతో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన విద్యార్థినులను ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.