by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:09 PM
TG: పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. ఈ నేఫథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని కోరుకంటి చందర్ ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.