by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:02 PM
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో, తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో, హైదరాబాద్‌లో టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం (100 అడుగుల) ఏర్పాటు చేస్తామని టీడీ. జనార్ధన్ ప్రకటించారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2024 చివరిలో, ఈ విగ్రహం అందరికీ అంకితమిస్తామన్నారు.