by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:08 PM
మహబూబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని రైతులు అందరూ నెక్కొండలో ప్రారంభమైన, సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, గూడూరు మండల కేంద్రానికి చెందిన, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డితో పాటుగా, చైర్మన్ రావుల హరీష్ రెడ్డిలు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో, పత్తిని విక్రయించే రైతులు తమతో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్, పట్టాదారు పాసుపుస్తకం లేదా పహాని పట్టుకుని రావాలని కోరారు. అదేవిధంగా ప్రతి మద్దతు ధర ఎనిమిది శాతం తేమ ఉంటే రూ.7521, 9% తేమ ఉంటే 7445, 10 శాతం తేమ ఉంటే రూ. 7370 ధర ఉంటుందని తెలిపారు.