by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:11 PM
వరంగల్ జిల్లా, నల్లబెల్లి అర్బన్ మహిళా సమఖ్య భావనంలో లో శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి సహకారంతో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు, యువకులకు ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన కార్యక్రమం మంగళవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లీడ్ బ్యాంక్ ఎఫ్.ఎల్.సి.సి యూనియన్ బ్యాంక్ కౌన్సిలర్ భాస్కర చారి, మాట్లాడుతూ అందరు ఆర్థిక అక్షరాస్యత పైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, సామాజిక భద్రత పథకాలైన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సిబిల్ స్కోర్, సుకన్య సమృద్ధి యోజన, పి. ఎం. ఇ. జి. పి, ఎన్. బి. ఎఫ్. సి, ఫిక్సిడ్ /టర్మ్, డిపాసిట్ అకౌంట్స్, రిక్యూరింగ్ డిపాజిట్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్, బి. ఎస్.బి.డి, టాక్స్ లిబిలిటీ ఆఫ్ ఎఫ్డి /ఆర్డి ఆకౌంట్స్, అకౌంట్ ఓపెనింగ్ అండ్ హౌ టూ డూ ట్రాన్సక్షన్స్, కే. వై. సి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇ-వాల్లేట్స్, యూ. పి. ఐ/ యూ. ఎస్. ఎస్. డి,/ఎ. ఇ. పి. ఎస్, లాకర్ ఫెసిలిటీ, లోన్ ఫెసిలిటీ, గవర్నమెంట్ స్కిమ్స్,సబ్సిడీ, గ్రీవెన్సీ రిడ్రస్స, ఆర్. బి - ఐ. ఒ. ఎస్, 2021, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా, ఎన్. ఇ. ఎఫ్. టి, ఆర్. టి. జి. ఎస్, ఐ. ఎం. పి. ఎస్, బి. బి. పి. ఎస్, ఎన్.ఇ. టి. సి ఫాస్ట్ టాగ్ పథకాల పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అనంతరం లక్నెపల్లి ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ రామ్ సింగ్ మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ఖాతాదారులందరు అప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 మరియు డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో, దాచుకోవడం ఎంత ముఖ్యమో, కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని బ్యాంకు సంబంధిత ఓటీపీ, పిన్ మరియు వ్యక్తిగత అకౌంట్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, లింకులను నొక్కడం ఫార్వర్డ్ చేయడము చెయ్యకూడదని, సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టేముందు చాలా వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు గోల్డెన్ అవర్ ని గుర్తుకు చేసుకొని వెంటనే 1930 నెంబర్ కి ఉచితంగానె కాల్ చేసి న్యాయం పొందవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ. పి. జి. వి. బి. ఫీల్డ్ ఆఫీసర్స్ కిరణ్ నాయక్, అనిల్ కుమార్, ఎ. ఇ. ఓ. శ్రీకాంత్, మరియు సంస్థ ఫిల్డ్ కోఆర్డినేటర్ ముబీన్ ఖాన్, గ్రామ కార్యదర్శి దర్మేందర్, మహిళా సంఘ ప్రతినిధులు సి. సి. పద్మ, వి. ఓ. ఎ. మమత, సి. ఏ. యమున రైతు సంఘ సభ్యులు వీరాస్వామి, రమణ, సోమన్న, సంస్థ ఫీల్డ్ ఆఫిసార్ - సౌజన్య, కీర్తన, కళాకారులు సాంబరాజు, రాజేందర్, స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు,రైతులు వ్యాపారులు మరియు బ్యాంక్ ఖాతా దారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.