by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:51 PM
తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను బుధవారం మంత్రి సీతక్క తెలుసుకున్నారు.
పలు రకాల డిజైన్ చీరలను చూపించి, నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని వారిని సీతక్క కోరారు. డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని మంత్రికి వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని సీతక్క తెలిపారు.