by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:48 PM
కులవివక్షను పోగొట్టడానికే కులగణన చేపట్టామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కులగణనతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ కులంలో బీజేపీకి ఏం పని? ఆమె ప్రశ్నించారు.
రాహుల్ కులం తెలియాలంటే దేశంలో కులగణన చేయండి.. కులపత్రంతో రాహుల్‌గాంధీ ఇంటికి బీజేపీ వెళ్తే చెబుతారని హితవు పలికారు. బీజేపీ కొన్ని వర్గాలకే న్యాయం చేస్తుందని కొండా సురేఖ విమర్శించారు.