by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:46 PM
మహబూబ్ నగర్ జిల్లాలో సీఐఈఆర్ పోర్టల్ ద్వారా 112 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ జానకి ధారావత్ పేర్కొన్నారు. మంగళవారం మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 112మందికి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్లు బుధవారం అందజేశారు.
ఆమె మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందివ్వాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, అధికారులు పాల్గొన్నారు.