by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:45 PM
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో పొరపాట్లు లేకుండా వివరాలను నమోదు చేయాలని ఎన్యూమరేట్ లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట్ మండలం జాజాపూర్, ధన్వాడలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు.
వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. గ్రామాలలో ఉదయం 7 గంటల నుండి 10 గంటల లోపు ప్రజలు ఇళ్ల వద్ద వుంటారని, అదే సమయంలో సర్వే నిర్వహించాలన్నారు. గ్రామాలలో ఎన్యూమరేటర్లు వెళ్ళే ఒక రోజు ముందు చాటింపు వేయించాలని సూచించారు.