by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:43 PM
రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులు అప్రమత్తంగా వుండాలని సీఐ శివశంకర్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జలాల్ పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రిజిస్టర్ ను పరిశీలించారు. కర్ణాటక నుండి రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా చూడాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. వాహనాలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు.