by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:57 PM
మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 7న, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మతోన్మాదపాసిస్టు, కార్పొరేట్ శక్తుల ప్రమాదం- వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం అనే అంశంపై ఎంసీపీఐ(యు) పార్టీ జాతీయ కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, నవంబర్ 7న జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లు (గోడపత్రికలను )ఈరోజు గూడూరు మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూకల ఉపేందర్ ఎంసిపిఐ(యు) పార్టీ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మైనార్టీ బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలిస్తున్న తీరు పూర్తిగా భారత రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసే, మనువాద ఫాసిస్టు పాలన కు పునాదులు వేస్తున్నాయని, తీవ్రవాదం అణిచివేత పేరుతో అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర వేసి, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, కార్యకర్తలను అరెస్టు చేసి, జైల్లో సంవత్సరాల తరబడి ఉంచడం జరుగుతుందని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం వలన ఫాదర్ స్టాన్ స్వామి, ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా, లాంటి వాళ్ళ మరణం.
ఈ ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని బట్టబయలు చేస్తున్నదని, ప్రజల మౌలిక సమస్యలు అయినా విద్యా, వైద్యం, ఆహారం, గృహవసతి, ఉద్యోగం, ఉపాధి, సహజ వనరుల పరిరక్షణ, పర్యావరణం పరిరక్షణ చేయాల్సిన ప్రభుత్వాలు. అడవులను సహజ సంపదను పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న కార్పొరేట్ శక్తులు ఆదాని, అంబానీ తదితరులకు అండగా ఉండి, ప్రశ్నించే శక్తులను నిర్దాక్షిణ్యంగా, భౌతికంగా, నిర్మూలిస్తున్న విధానం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫాసిస్టు పాలన విధానం స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే ప్రస్తుత రాజకీయాలు వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం అనే నినాదంతో, జరుగుతున్న జాతీయ సెమినార్ విజయవంతం చేయాలని అన్నారు. ప్రజలను ప్రజాస్వామ్యవాదులకు, విద్యార్థి, మేధావి వర్గాల కు విజ్ఞప్తి చేస్తూ.. ఈ సదస్సులో ఎం సిపిఐ(యు) జాతీయ కార్యదర్శి మద్ది కాయల అశోక్, కిరణ్ జిత్ శకాన్ ,(పంజాబ్) ఆర్ఎంపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగత్రామ్ పాస్లా, సిపిఐ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమలక్క, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంద మాస్ లైన్ నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట్రామయ్య, కేజీ రామచందర్, తదితర జాతీయ నాయకులు పాల్గొంటారని, ఈ సెమినార్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బందెల వీరస్వామి, నాయకులు ఈసం రామయ్య గుండ గాని సత్తయ్య కటకం బుచ్చి రామయ్య పిట్టల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.