by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:45 PM
సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.ప్రభుత్వ పాఠశాలల టీచర్ల సహాయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయించాలనుకోవడం చట్ట ఉల్లంఘన అవుతుందన్న హరీష్ రావు.ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడు టీచర్లకు కూడా శాపంగా మారుతోందని విమర్శ.జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికల డ్యూటీలకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల టీచర్ల సహాయం తీసుకోవాలని విద్యాహక్కు చట్టంలో ఉందన్న హరీష్ రావు..