by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:30 PM
సమగ్ర కుటుంబ సర్వేతో బడుగు, బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. స్వాతంత్రం వచ్చాక దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. నెల రోజులలోపే ఈ సర్వే పూర్తికానున్నట్లు చెప్పారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలన్నారు.