by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:51 PM
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా ప్రత్యేకాధికారి ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడిమ్యాల మండలంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధు సుధన్, డిఆర్డివో రఘు వరన్ పాల్గొన్నారు.