by Suryaa Desk | Thu, Nov 07, 2024, 02:30 PM
క్రీడల పోటీలతో క్రీడాకారుల నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని..ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్ 17 బాల బాలికల కోకో పోటీలను బుధవారం రోజున స్థానిక నాయకులతో, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. తదుపరి పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ లో రానున్న రోజుల్లోనూ క్రీడల్లో రాణించి ఈ ప్రాంతానికి క్రీడాకారులు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఈవో మాధవి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్, సురేందర్, దాసరి రమేష్, సాయిరి మహేందర్, బిరుదు కృష్ణ,మండల అధ్యక్షులు చిలుక సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.