by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:59 PM
కోహెడ మండలంలోని రైతు వేదికలో మంగళవారం రోజున రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు సోదరులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగి పంటలు అయినటువంటి వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటల సాగులో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న కలుపు నివారణ పద్ధతుల గురించి యాసంగి పంటల్లో వచ్చే వివిధ పురుగులు,తెగుళ్ళ గురించి, వాటి యాజమాన్య పద్ధతుల గురించి క్లుప్తంగా విరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, మండల వ్యవసాయ అధికారి సతీష్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీధర్ రెడ్డి, శివ, రాకేష్, మహిపాల్ రెడ్డి, రఘు రైతులు పాల్గొన్నారు.