by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:52 PM
నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని సిద్ధం చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చని జీనేక్స్ సీడ్స్ రిజినల్ మేనేజర్ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం నాడు మండలము లోని కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జీనేక్స్ సీడ్స్ వారి సౌజన్యంతో రీసెర్చ్ వరి బాదుషా 4455 దొడ్డు రకానికి సంబంధించి వరి పైరు కోసం అవగాహన కల్పించారు. రీసర్చ్ వరి బాదుషా 4455 ని మండలము లో ని కొండాపూర్ గ్రామానికి చెందిన K. చంద్రం అనే రైతు అతని సొంత వ్యవసాయ పొలంలో 5 ఎకరాలలో రీసెర్చ్ వరి బాద్షా సాగు సాగు చేయడం జరిగింది రైతుకుఅధిక దిగుబడి రావడంతో జీనేక్స్ సీడ్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 200 మంది రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం రైతు k. చంద్రం ను జినెక్స్ సీడ్స్ సంస్థ వారు సన్మానించారు.
ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ రీసెర్చ్ వడ్లు బాదుషా , 4455 దొడ్డు రకం వరి సాగు చేయడంతో అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. పంటల్లో వచ్చే పురుగుల గురించి పచ్చ దోమల మచ్చల గురించి తెగుల గురించి రైతులు నష్టపోకుండా సలహాలు సూచనలను తెలియజేశారు. రీసెర్చ్ వరి బాదుషా 4455 రకం ఎకరానికి దాదాపు 35 నుంచి 40 క్వింటాళ్లు వస్తుందని రైతులకు తెలిపారు.జినేక్స్ సీడ్స్ లో వరి, మొక్కజొన్న, పత్తి, వివిధ రకాల విత్తనాలు రైతులకు లభిస్తాయని జినేక్స్ సీడ్స్ కంపెనీ రీజినల్ ఆఫీసర్ వివరించారు. ఈ కార్యక్రమంలో , శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ జగదేవపూర్ యజమాని జిల్లా వెంకటేశం, కొండాపురం మాజీ తాజా సర్పంచ్ తిగుళ్ల జహంగీర్ ఏరియా ఆపీసర్సు నవీన్, , వివిధ గ్రామాల రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.