by Suryaa Desk | Wed, Nov 06, 2024, 11:51 AM
ఉత్తరాది ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని ఉత్తరాది ప్రజలకు చెరుకును పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పటాన్‌చెరు నియోజకవర్గంలో నివసిస్తున్నారని, వారందరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.