by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:32 PM
నాగార్జున సాగర్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. బుధవారం నాగార్జున సాగర్ రిజర్వాయర్ లోకి 13 లక్షల చేప పిల్లలను వదిలారు.
̣మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.