by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:35 PM
పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసని ఎద్దేవా చేశారు.
'బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఫ్యూడల్ వ్యవస్థను పునర్ నిర్మాణం చేయడం కోసమే గత పాలకులు పనిచేశారు' అని విమర్శించారు.