by Suryaa Desk | Wed, Nov 06, 2024, 02:36 PM
జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, ఏఈ చరన్, వంజరి సంఘం అధ్యక్షులు అంజనేయులు, నాయకులు దుమలా రాజ్ కుమార్, పెద్దింటి రాజు, దాసు, రాము, శంకర్, గోపి, రాములు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.