by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:21 PM
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కోండ్ర పవన్ కళ్యాణ్-కోండ్ర ప్రహర్ష దంపతులిద్దరు మరణించడంతో వారి పిల్లలిద్దరూ కోండ్ర ఆధ్యశ్రీ,కోండ్ర ఆయాన్స్ అనాథలుగా మారారు.తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన పిల్లల గురించి తెలుసుకొని ఎస్పీఎఫ్ ట్రస్ట్ ప్రతినిధి, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ జివి. శ్యామ్ ప్రసాద్ లాల్,,జగిత్యాల మిత్ర బృందం సభ్యులు స్పందించారు.మానకొండూర్ మండల కేంద్రంలోని పిల్లలు చదువుతున్న వేద హై స్కూల్ కు మంగళవారం చేరుకొని,పిల్లల వివరాలు తెలుసుకొని పిల్లల స్కూల్ ఫీజు చెల్లించారు.
పిల్లల భవిష్యత్తు నిమిత్తం రూ.1 లక్ష 30 వేలు పిల్లల పేరున ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో వారికి అందించారు.శ్యాంప్రసాద్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ జీవి.శ్యాంప్రసాద్ లాల్,స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ చార్ల వేణుమాధవ్ రెడ్డి,హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్,పిఆర్టియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్,జగిత్యాల మిత్ర బృందం సభ్యులు మేఘారాజు,కుమార్,జి శ్రీనివాస్,ఉదయ్ కిరణ్ రావు చేయుత అందించారు.ఈ కార్యక్రమంలో వేద స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండ్ర సురేష్,గ్రామస్తులు కొండ్ర రాజకుమార్,కొండ్ర పోచయ్య, కొండ్ర వెంకటస్వామి,రాజశేఖర్ పాల్గొన్నారు.