by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:17 PM
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్&వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక్క రోజు దీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెళ్లి ముత్యంరావు మాట్లాడుతూ. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికుల పర్మినెంట్, వేతనాల పెంపు, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్రంలో 34 రోజుల సమ్మె సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సమ్మెకు మద్దతు ప్రకటించి సమ్మె టెంట్ల వద్దకు వచ్చి మల్టీ పర్పస్ విధానం రద్దుచేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపింది.గత ప్రభుత్వ చివరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష హెూదాలో ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి వర్యులు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధికారం చేపట్టి 11నెలలు కావస్తున్నా పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బకాయి వేతనాలకు బడ్జెట్ కేటాయించినప్పటికీ అనేక పంచాయితీలలో కార్మికులకు ఇంకా వేతనాలు ఇవ్వకపోవడంపై చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరుగుతాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పంచాయతీ కార్మికులకు నిరాశే ఎదురైంది. దీంతో అసంతృప్తితో ఉన్న పంచాయితీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు దీక్షలు చేపట్టడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో పంచాయితీ ఎన్నికల పనుల భారమంతా ఈ సిబ్బందే నిర్వర్తించాలి. రెవెన్యూ శాఖ పని కూడా పంచాయితీ కార్మికులే నిర్వహిస్తున్నారు. కావున పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి సమస్యలు పరిష్కరించి మల్టిపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో నవంబర్ 20 తర్వాత సమ్మె తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.....ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిపెల్లి రవీందర్,ఎండి కాజా ఉపాధ్యక్షులు అశోక్ ,లచ్చయ్య,జిల్లా కమిటీ సభ్యులు ఎండీ గౌసోద్దీన్,శ్రీనివాస్ ,అంబాల,లక్ష్మణ్,రాజయ్య, వైద్య సంపత్ రెడ్డి మల్ల నాగేశ్వర్ నాగరాజు ముస్తఫా, రవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.