by Suryaa Desk | Wed, Nov 06, 2024, 01:44 PM
టేక్మాల్ మండలం ఎల్లుపెట్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ పీడీ, ఎమ్మార్వో లతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం 17 వరకు ఉండేలా చూసుకోవాలని గ్రామ రైతులకు సూచించారు.