by Suryaa Desk | Thu, Nov 07, 2024, 03:49 PM
వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సోషల్ మీడియా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగాచామల రఘుపతి రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక లాంటిదని అన్నారు.అంతేకాకుండా కష్ట పడి పని చేసే వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.ప్రభుత్వం అబివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా విస్తృతంగ సోషల్ మీడియా లో ప్రచారం చేయాలని అన్నారు.అదేవిధంగా సోషల్ మీడియా లో పనిచేసే వారికి పార్టీలో మరియు ప్రభుత్వంలో భవిష్యత్ లో వారికి స్థాయిని బట్టి సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్,కో కో ఆర్డినేటర్ సిద్ధునూరి యాదగిరి,టౌన్ కో ఆర్డినేటర్ విజయ్ మండల కో ఆర్డినేటర్లు సిద్దయ్య ,నందు,శ్రీకాంత్, నరేందర్ భరత్,వెంకట్,తులసీదాస్,అశ్రఫ్ అలి, మహేందర్ మరియు గ్రామ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.