by Suryaa Desk | Thu, Nov 07, 2024, 02:25 PM
దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ఎజాజ్ అహమ్మద్చే తిరాత శిక్షణ కార్యక్రమం ఉదయం: 9:30 నుండి మధ్యాహ్నం :4:30 నిమిషాల వరకు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎండి సాదత్ అలీ తెలిపారు..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దుబ్బాక మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్ గారు మాట్లాడుతూ... చేతివ్రాత నిపుణుడిగా రాయడం ఒక కళ అని.. దానిని మనసు పెట్టి నేర్చుకోవాలని విద్యార్థులకు బోధించేవారు ఎజాజ్ అహమ్మద్ .
తన పాఠశాల విద్యార్థులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ రాసే విధానంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేవారు ఎజాజ్ అహమ్మద్. ఏ అక్షరాన్ని ఎలా రాయాలో ఆకట్టుకునేలా చెబుతూ అక్షరాలు దిద్దించేవారు. ‘అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే’ అనే పుస్తకానికి రూపకల్పన చేశారు .ఎజాజ్ అహమ్మద్ లక్షల ప్రతులను విద్యార్థులకు పంచి ఎందరి చేతివ్రాతనో ప్రభావితం చేశారు. మా పాఠశాలల్లో చేతివ్రాత తరగతులు నిర్వహించినందుకు ఎజాజ్ అహమ్మద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ డాక్టర్ మురళీకృష్ణ సిద్దిపేట గారి ఆర్థిక సాయంతో పాటు మరియు మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి మరియు ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు క్యాసర్ల సాయికుమార్, దివిటి ప్రశాంత్, చిన్న రాయిని రాజు, బోలుగని వికాస్, నర్మెట శ్రావణ్ మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులందరికీ చేతివ్రాతపై శిక్షణ ఇవ్వడానికి ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు కార్యక్రమం నిర్వహించబడినది తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ చేతి వ్రాత నిపుణులు ఎజాజ్ అహమ్మద్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మరియు కౌన్సిలర్లు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ,సభ్యుల చేత ఘనంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మరియు సభ్యులు మరియు వార్డు కౌన్సిలర్లు, పాఠశాల తల్లిదండ్రులు మరియు పల్లె శ్రీనివాస్ గౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ రెడ్డి , కే శ్రీకాంత్, నరేష్, బాలకృష్ణ ,పద్మావతి, అశోక్, శైలజ, దినేష్ చంద్రశేఖర్ రాజేందర్ మరియు నవీన్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.