![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 04:28 PM
హైదరాబాద్‌లో MMTS విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిటీ పరిధిలో 102.4 కి.మీ. పొడవున ఆరు మార్గాల్లో కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయనుంది. అలాగే ఫలక్ నుమా-ఉందానగర్ వంటి ప్రాంతాల్లో డబ్లింగ్ నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు.హైదరాబాద్ నగర పరిధిలో సుమారు 102.4 కిలోమీటర్ల మేర ఆరు ప్రత్యేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లను నిర్మించనున్నారు. ముఖ్యంగా ఫలక్‌నుమా , ఉమ్దానగర్ వంటి కీలకమైన ప్రాంతాల్లో డబ్లింగ్ (రెండు లైన్లు) నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ విస్తరణ పనుల కోసం దాదాపు రూ. 1,169 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రం కేటాయించింది. ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రారంభించనుంది.