|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 09:04 PM
దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై ఓ భారీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను రాజమౌళి స్వయంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.అదే సమయంలో రాజమౌళి ఆ పోస్టుకు ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జోడించారు. “పృథ్వీరాజ్‌తో మొదటి షాట్ పూర్తయ్యాక వెంటనే అతని వద్దకు వెళ్లి, నేను చూసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరని చెప్పాను” అని పేర్కొన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర పేరు ‘కుంభ’ అని వెల్లడించారు.తన పాత్ర శక్తివంతమైనదిగా, క్రూరమైన విరోధిగా ఉంటుందని రాజమౌళి వివరించారు. “అలాంటి విలన్‌కి ప్రాణం పోయడం నిజంగా సంతృప్తినిచ్చే అనుభూతి” అని క్యాప్షన్‌లో రాసి అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశారు.
Latest News