|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 11:27 PM
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ SSMB 29 చుట్టూ హైప్ రోజురోజుకు పెరుగుతోంది.ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి టీమ్ భారీ సెట్స్ ఏర్పాట్లు చేస్తూ, ప్రపంచ స్థాయి ప్రెజెంటేషన్ కోసం సిద్ధమవుతోంది.ఇప్పటివరకు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మహేశ్ బాబు స్పెషల్ వీడియో ద్వారా సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మహేశ్ బాబు వీడియోలో “ఇన్ని నెలలుగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు 15న సమాధానం ఇస్తాను. మా అనుభవాలను ఆ రోజు మీతో పంచుకుంటాం. ఈ ప్రపంచం ఆ రోజు మా కథలోకి వస్తుంది” అని తెలిపారు.ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఉత్సాహంతో మునిగిపోయారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి క్లారిటీ రాకపోవడం వల్ల, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్‌లో టైటిల్ రివీల్ తో పాటు, మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ కూడా అందించనున్నట్టు టాక్. రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి.
Latest News