|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:54 PM
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహూజా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన భర్త గోవిందా మంచి భర్త కాదంటూ సునీత చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. సునీత తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనిషి తనను తాను అదుపులో ఉంచుకోవాలి. యవ్వనంలో తప్పులు చేయడం సహజం. నేను చేశాను, గోవిందా కూడా చేశారు. కానీ, ఒక వయసు వచ్చాక కూడా అవే తప్పులు పునరావృతం చేస్తే అది శోభనివ్వదు. అందమైన కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నప్పుడు అసలు ఆ తప్పులు ఎందుకు చేయాలి?" అని ఆమె ప్రశ్నించారు.ఒక స్టార్ హీరో భార్యగా ఉండటంలోని కష్టాలను వివరిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. "ఆయన ఒక హీరో. భార్యల కన్నా హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఒక స్టార్ భార్యగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. గుండెను రాయి చేసుకోవాలి. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు 38 ఏళ్ల వివాహ జీవితం పట్టింది. యవ్వనంలో ఈ విషయాలు నాకు తెలియలేదు" అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.గోవిందా ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు అని, కానీ మంచి భర్త మాత్రం కాదని ఆమె తెలిపారు.
Latest News