|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 10:56 AM
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 7లో తన ఇంటిని కబ్జా చేశారంటూ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై శివ ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు తాళం పగలగొట్టి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి ఆక్రమించేందుకు యత్నించారని ఆరోపించారు. తన సిబ్బందిని దూషించి, దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఎన్ఎస్ 329, 324, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Latest News