|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 03:48 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పైనా, యువ దర్శకుడు బుచ్చిబాబుపైనా ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' చిత్రం నుంచి విడుదలైన 'చికిరి చికిరి' పాట సృష్టించిన సంచలనంపై వర్మ స్పందించారు. ఈ పాటలో చరణ్ నటనను, అతన్ని చూపించిన విధానాన్ని మెచ్చుకుంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. "సినిమాలోని ప్రతి కళారూపం, ప్రతి విభాగం అసలు ఉద్దేశ్యం హీరోను మెరుగుపరచడమే. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌ను తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో చూశాను. 'చికిరి చికిరి' పాటలో చరణ్ ప్రదర్శించిన నటన, ఆవేశం, ఎనర్జీ నేను ఈ మధ్య కాలంలో చూసిన అత్యుత్తమ ప్రదర్శన" అని రామ్ గోపాల్ వర్మ కొనియాడారు.
Latest News