|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 04:26 PM
నటుడు ధర్మేంద్ర (89) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత నెల 31న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన, బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఆయనకు ఇంట్లోనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతిత్ సందానీ పీటీఐకి వెల్లడించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయనకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని వివరించారు.
Latest News