|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 07:58 PM
హీరో అభిషేక్ బచ్చన్‌కు 27 ఏళ్లుగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న అశోక్ మృతి చెందాడు. దీంతో బచ్చన్ ఫ్యామిలీ తీవ్ర భావోద్వేగానికి లోనయింది. సోషల్ మీడియాలో అశోక్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ, 'అశోక్ దాదా నా కుటుంబ సభ్యులు. నా మొదటి సినిమా నుంచి నా మేకప్ చూసుకునేవాడు. ఆయన అన్న దీపక్ మా నాన్న దగ్గర 50 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అశోక్ ఎప్పుడూ చిరునవ్వుతో, ఆశీర్వాదంతో ఉండేవాడు. ఆయన లేకుండా షూటింగ్‌కు వెళ్ళేవాడిని కాదు. ఇకపై ఆయన లేకుండా సెట్‌కు వెళ్లాలంటేనే మనసు ముక్కలవుతోంది’ అంటూ పేర్కొన్నాడు.
Latest News