|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 08:24 PM
Globe Trotter Event | మరికొద్ది సమయంతోనే రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి–మహేశ్ బాబు సినిమా మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. “గ్లోబ్ ట్రాటర్” పేరుతో జరుగుతున్న ఈ స్పెషల్ ఈవెంట్ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఈ వేడుకకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్‌ను షేర్ చేశాడు. ఈ ఈవెంట్‌లో ఏం ఏమి రాబోతున్నాయో ఆయన స్వయంగా వెల్లడించారు.గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో సినిమా టైటిల్ రిలీజ్‌తో పాటు, ఫిల్మ్‌లో చూపించబోయే ఫిక్షనల్ యూనివర్స్‌ను పరిచయం చేసే అద్భుత విజువల్స్‌ను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల భారీ స్క్రీన్‌పై మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో తొలుత చూపించి, ఆ తర్వాత ఆ వీడియోను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదల చేయనున్నట్లు చెప్పారు.ఈ అప్‌డేట్ బయటకు రావడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్‌లో మరోసారి జోష్ పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీకి భారీగా చేరుకుని వేడుక ప్రారంభాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టైటిల్ ఎలా ఉండబోతుంది? గ్లింప్స్‌లో ఏం చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.
Latest News