|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 04:41 PM
1993లో వచ్చిన 'జురాసిక్ పార్క్' ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఆ తరువాత నుంచి సీక్వెల్స్ రావడం మొదలైంది. 2022లో 'జురాసిక్ వరల్డ్ : డొమినియన్' ప్రేక్షకులను పలకరించగా, ఇటీవలే 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' థియేటర్లలో దిగిపోయింది. ఈ ఏడాది జూన్ లో విడుదలైన ఈ సినిమా, 7,500 కోట్లను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా, రెంటల్ విధానంలో కొన్ని రోజుల క్రితమే ఓటీటీకి వచ్చింది. అలాంటిదేమీ లేకుండా ఈ నెల 14వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో అందుబాటులోకి వచ్చింది.
కథ: ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధమైన జబ్బులతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. గుండె జబ్బులను నివారించడంలో డైనోసార్ ల రక్తంతో చేసే ఔషధం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. డైనోసార్ లలో నేలపై నడిచేవి . సముద్ర జలాలలో నివసించేవి .. గాలిలో ఎగిరేవి ఉంటాయి. ఈ మూడు రకాల డైనోసార్ లు ప్రాణాలతో ఉండగానే వాటి నుంచి రక్తనమూలను సేకరించవలసి ఉంటుంది. అయితే ఈక్వెడార్ ప్రాంతంలోని వాతావరణం అనుకూలంగా ఉండటం వలన, అక్కడ ఈ డైనోసార్ లు ఎక్కవగా నివసిస్తూ ఉంటాయి. గతంలో అక్కడ ఈ డైనోసార్ లపై ప్రయోగాలు జరిగాయి. అయితే కొన్ని కారణాల వలన ఆ ల్యాబ్ ఇప్పుడు మూతబడిపోయింది. అలంటి ప్రాంతానికి వెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎవరికి ఎలాంటి అనుమతి లేదు. అయితే డబ్బు కోసం 'మార్టిన్ క్రెబ్స్' (రూపర్ట్ ఫ్రెండ్) రంగంలోకి దిగుతాడు. ఈ విషయంలో ఆయన డాక్టర్ హెన్రీ లూమిస్ (జోనాథన్ బైలి) జోరా బెన్నెట్ (స్కార్లెట్ జాన్సన్) సాయాన్ని కోరతాడు. బోట్ ఓనర్ డంకెన్ (మహెర్షలా అలీ) ను ఒప్పిస్తాడు. అందరూ కలిసి సముద్ర ప్రయాణం మొదలుపెడతారు. మార్గమధ్యంలో ఆపదలో చిక్కుకున్న రూబెన్ కుటుంబ సభ్యులైన నలుగురిని ఈ బృందం కాపాడుతుంది. అందరూ కలిసి డైనోసార్ లు నివసించే ప్రదేశంలోకి అడుగుపెడతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి ఆపదాలు .. అనుభవాలు ఎదురవుతాయి? తాము అనుకున్నట్టుగా వాళ్లు శాంపిల్స్ సేకరిస్తారా? అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా? అనేది మిగతా కథ.
Latest News