|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 12:22 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి: 2898 ఏడీ' చిత్రానికి కొనసాగింపుగా 'కల్కి-2' రానుంది. దీనిపై తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని.. అది పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతామని పేర్కొన్నారు. సెకండ్ పార్ట్‌లో భైరవ, కర్ణ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్ట్-1లో మహాభారతం నేపథ్యంలో సుమతీ, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకొని ఇక్కడి వరకూ వచ్చామని.. పార్ట్-2లో ప్రభాస్‌ను ఎక్కువగా చూపిస్తామని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా అనుకోలేదని అన్నారు.
Latest News