by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:06 PM
పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే హౌస్ లిస్టింగ్ లో భాగంగా బృందాలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇంటికి హౌస్ లిస్టింగ్ చేస్తూ స్టిక్కర్ ను బృందాలు అతికించాయి.
నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు మూడు రోజులపాటు ప్రతి ఎనిమిరేటర్ తన పరిధిలోని 150 ఇండ్లను చెక్ చేసుకుని స్టిక్కర్ అతికించడం జరుగుతుందని, తరువాత ప్రతిరోజు 10 ఇండ్ల చొప్పున 15 రోజులలో సర్వే పూర్తి చేయాలని అన్నారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన సమాచారం సేకరించి చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.