by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:32 PM
తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2 వ తేది నుండి 4 వ తేది వరకు ఆసిఫాబాద్ లో నిర్వహించిన 38 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ - 2024 లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకుల అక్షిత పాల్గొని అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్ర స్థాయి లో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువగా సాధన చేసి, తన అత్యుత్తమ ఆటతీరు కనబరిచి రాష్ట్ర స్థాయి లో తృతీయ స్థానం సాధించడం అనేది మా పాఠశాలకు, పెద్దపల్లి జిల్లా కి గర్వకారణం అనే, కాంస్య పతకం సాధించిన విద్యార్థినిని, పతాక సాధనలో కృషి చేసిన పిఇటి స్రవంతి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్ పాల్గొని అభినందించారు.