by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:30 PM
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో వికారాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి గారితో కలిసి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు ఎన్నెపల్లి, 4వ వార్డు శివారెడ్డి పెట్, 15వ వార్డులలోని హనుమాన్ టెంపుల్ దగ్గర అలాగే మారుతి నగర్ లో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న యుజిడి పైప్ లైన్ పనులకు చైర్ పర్సన్ మంజుల రమేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులలో నాణ్యత పాటించి, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మంజుల ముత్యంరెడ్డి, అనంత్ రెడ్డి, డిఈ రాకేష్ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, ముత్యం రెడ్డి, షరీఫ్, సర్పరాజ్, ఎన్నెపల్లి కృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.